Press meet

10.11.2018న ఉదయం 09:00 గంటలకు సామాన్య ప్రజా పార్టీ కార్యాలయంలో, రాష్ట్ర అధ్యక్షులు ఆదిబాబు గారి ఆధ్వర్యంలో డాట్ ల్యాండ్స్ కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం చేయకపోవడం వలన అనేకమంది సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై - ప్రెస్ మీట్. 1. రెవిన్యూ మినిస్టర్ చెప్పిన విధంగా 60,164 ధరకాస్తులు వచ్చాయి అని మరియు సుమారుగా 24 లక్షల భూములు dotted ల్యాండ్స్ లో ఉన్నాయి అని ప్రభుత్వం గుర్తించింది అని - వాటిని పరిష్కరిస్తామని సంవత్సరం క్రితమే హామీ ఇచ్చారు కాని హామీని అమలు చేయకపోవడాన్ని సామాన్య ప్రజా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 2. ఈ dotted ల్యాండ్స్ సమస్యను పరిష్కరించకపోవడం వలన అనేక కుటుంబాలు - భూమిని అమ్ముకోలేక తాకట్టుకు కూడా ఎవ్వరు అంగీకరించక - కనీసం బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వక - పిల్లల చదువులు గాని మరియు పెళ్లిళ్లు గాని చేయాలేక అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి - dotted ల్యాండ్స్ సమస్యను వెంటనే పరిష్కరించాలని సామాన్య ప్రజా పార్టీ డిమాండ్ చేస్తుంది. 3. ఈ భూముల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంలోని అనేక మంది ఆఫీసర్స్ లంచాలు తీసుకుంటున్నారు - ఈ విధానాన్ని కూడా సామాన్య ప్రజా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది - SPP అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తుంది ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు B.అప్పారావు, రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, E. చంద్రశేఖర్, అధికార ప్రతినిధి తురగా గోపాలకృష్ణ, సిటీ అధ్యక్షులు P. వేణుగోపాల్, I.T. కన్వీనర్ M.వెంకటరమణ, SPP TUC కో-కన్వీనర్ D. వెంకటరమణ, సిటీ ఉపాధ్యక్షులు పొన్నాడ శ్రీనివాస్ మరియు ఇతర వార్డ్ కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు.